గుట్టుగా చెంచుల గెంటివేత!

ABN , First Publish Date - 2021-03-25T09:03:01+05:30 IST

అడవి బిడ్డలైన చెంచులను నల్లమల నుంచి మైదాన ప్రాంతాలకు తరలించేందుకు రంగం సిద్ధమైందా? గుట్టు చప్పుడు కాకుండా ఈ తంతు కొనసాగుతోందా? కొత్త ప్యాకేజీ ఆశ చూపించి అంగీకార ప త్రాల సేకరణ చేపట్టారా?.

గుట్టుగా చెంచుల గెంటివేత!

  • నల్లమల నుంచి తరలించే ప్రయత్నం
  • బలవంతంగా అంగీకార పత్రాల సేకరణ
  • రూ.10లక్షల ప్యాకేజీ..15లక్షలకు పెంపు
  • వద్దంటే.. 3 ఎకరాల వ్యవసాయ భూమి
  • రంగారెడ్డి జిల్లా బాచారంలో పునరావాసం
  • ఇవీ.. అటవీ శాఖ అధికారుల ప్రతిపాదనలు

నాగర్‌కర్నూల్‌,మార్చి 24(ఆంధ్రజ్యోతి): అడవి బిడ్డలైన చెంచులను నల్లమల నుంచి మైదాన ప్రాంతాలకు తరలించేందుకు రంగం సిద్ధమైందా? గుట్టు చప్పుడు కాకుండా ఈ తంతు కొనసాగుతోందా? కొత్త ప్యాకేజీ ఆశ చూపించి అంగీకార ప త్రాల సేకరణ చేపట్టారా?.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం నుంచి చెంచులను తరలించేందుకు అటవీ శాఖ అధికారులు గుట్టుగా అంగీకార పత్రాలు సేకరించడం చర్చనీయాంశంగా మారింది. నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు రెండు దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను ప్రజాసంఘాలు తీవ్రంగా వ్య తిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అంగీకార పత్రాల సేకరణతో మరో సారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, గుంటూరు, ప్రకాశం, కర్నూల్‌ జిల్లా ల్లో 2.75లక్షల హెక్టార్లలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అటవీ ఉత్పత్తులనే జీవనాధారంగా చేసుకొని 107చెంచు పెంటల్లో దాదాపు పదివేల చెం చు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 1999లో నక్సల్స్‌ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు నల్లమలలోని కొన్ని చెంచు కుటుంబాలను మైదాన ప్రాంతాలకు తరలించారు. అమరగిరి వద్ద ప్రత్యేక పునరావాస కేంద్రా న్ని ఏర్పాటు చేశారు. 


అయితే, అక్కడి వాతావరణ పరిస్థితుల్లో జీవించలేక ఇద్దరు మరణించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.  ఆ తర్వాత నల్లమలలో యు రేనియం తవ్వకాలు, అభయారణ్యం పేరిట చెంచుల ను మరోసారి మైదాన ప్రాంతాలకు తరలించే యోచన చేశారు. ఈ క్రమంలో కుటుంబానికి రూ.పది లక్షల నగదు ప్యాకేజీతోపాటు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ లో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పినప్పటికీ అడవి బిడ్డ లు అంగీకరించలేదు. దీంతో నగదు ప్యాకేజీని రూ. 15 లక్షలకు పెంచడంతో పాటు రంగారెడ్డి జిల్లా బాచా రం దగ్గర ఇళ్ల నిర్మాణం, నగదు కాదనుకుంటే మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. నల్లమలలోని వటువర్లపల్లి, చార్లపల్లి, పులిచింతలబయలు, కుమ్మన్‌పెంట, కొల్లంపెంట, మల్లాపూర్‌, అప్పాపూర్‌, బైరాపూర్‌, రాం పూర్‌, తంగిడిగుండాల, మేడిమలకల, ఈర్లపెంటల్లో 175 చెంచు కుటుంబాలు నివసిస్తుండగా, 80 శాతం కుటుంబాలతో అంగీకార పత్రాలపై బలవంతంగా సం తకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉం డగా, అభయారణ్యంలోని పెంటలను మైదాన ప్రాంతాలకు తరలించే క్రమంలో చెంచులకు మాత్రమే ప్యాకేజీని వర్తింపజేస్తుండడంతో వటువర్లపల్లి, సార్లపల్లి, పు లిచింతల బయలులో ఉన్న ఎస్సీ, బీసీ కుటుంబాలు తీ వ్రంగా నష్టపోతున్నాయి.  వీళ్లు ఇళ్లు, వాకిలీ, గొడ్డు, గోదా అన్ని వదులుకొని రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

Updated Date - 2021-03-25T09:03:01+05:30 IST