బౌలర్లు బాదుతున్నారు.. గబ్బాలో మనోళ్లు అదుర్స్

ABN , First Publish Date - 2021-01-17T16:50:20+05:30 IST

గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో టీమిండియా బౌలర్లు శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్.. బ్యాటింగ్‌తో అదుర్స్ అనిపించారు.

బౌలర్లు బాదుతున్నారు.. గబ్బాలో మనోళ్లు అదుర్స్

బ్రిస్బేన్: గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో టీమిండియా బౌలర్లు శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్.. బ్యాటింగ్‌తో అదుర్స్ అనిపించారు. ఇద్దరూ కలిసి అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోవడం విశేషం. సుందర్ 108 బంతుల్లో 50 పరుగులు చేస్తే, శార్దుల్ 90 బంతుల్లో 53 పరుగులు పూర్తి చేసుకున్నాడు. శార్దుల్ ఠాకూర్‌కు ఇది తొలి టెస్ట్ హాఫ్ సంచరీ. టాప్ ఆర్డర్ విఫలమైన సందర్భంలో బౌలర్లు ఇద్దరూ వికెట్లకు అడ్డుపడి.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్ ఇంకా 77 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 97 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 292 పరుగులు. 


అంతకు ముందు.. 62/2 స్కోర్ దగ్గర మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. 186 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.  రోహిత్ శర్మ(44), శుభ్‌మన్ గిల్(7), చతేశ్వర్ పుజారా(25), ఆజింక్య రహానే(37), మయాంక్ అగర్వాల్(38), రిషబ్ పంత్(23) అవుట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ 3 వికెట్లు, స్టార్క్, కమ్మిన్స్, లియాన్ చెరో వికెట్ తీసుకున్నారు.  

Updated Date - 2021-01-17T16:50:20+05:30 IST