రేపటితో ముగియనున్న పారాలింపిక్స్.. భారత పతకధారిగా అవని లేఖర

ABN , First Publish Date - 2021-09-05T02:04:48+05:30 IST

జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ రేపటి (ఆదివారం)తో ముగియనున్నాయి.

రేపటితో ముగియనున్న పారాలింపిక్స్.. భారత పతకధారిగా అవని లేఖర

టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ రేపటి (ఆదివారం)తో ముగియనున్నాయి. ఈ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన షూటర్ అవని లేఖర ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతకాన్ని చేబూని ముందుకు సాగనుంది.


19 ఏళ్ల అవని 10 మీటర్ల రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1లో బంగారు పతకం సాధించగా, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఎస్‌హెచ్1లో కాంస్య పతకం సాధించింది. ఈ ఒలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు 17 పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు.


ఈ క్రీడల్లో భారత్ నుంచి మొత్తం 54 మంది అథ్లెట్లు 9 అంశాల్లో పోటీపడ్డారు. ఇందులో ఆర్చరీ, అథ్లెటిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్), బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్ తదితర గేమ్స్ ఉన్నాయి. భారత్ సాధించిన 17 పతకాల్లో నాలుగు స్వర్ణ పతకాలు, ఏడు రజతాలు, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి.   

Updated Date - 2021-09-05T02:04:48+05:30 IST