కృష్ణా: జిల్లాలోని ఘంటసాల మండలం కొడాలిలో విషాదం చోటుచేసుకుంది. కోడిపందాల బరి సమీపంలో వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. మృతుడు వెంకటేశ్వరరావు(40) ఇంట్లో గాయాలతో పడి ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించారు. గాయాలతో పడి ఉన్న వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.