యాపిల్‌ గాడ్జెట్స్‌ వాడతారా వీటికి దూరం ఉండండి!

ABN , First Publish Date - 2021-07-03T05:30:00+05:30 IST

తమ కంపెనీ గాడ్జెట్లు వాడే యూజర్లు అయస్కాంతతత్వం ఎక్కువగా ఉండే వస్తువులకు దూరంగా ఉండాలంటూ

యాపిల్‌ గాడ్జెట్స్‌ వాడతారా వీటికి దూరం ఉండండి!

తమ కంపెనీ గాడ్జెట్లు వాడే యూజర్లు అయస్కాంతతత్వం ఎక్కువగా ఉండే వస్తువులకు దూరంగా ఉండాలంటూ యాపిల్‌ ఒక లిస్టును విడుదల చేసింది. స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ఫిట్‌నెస్‌ ట్రాకర్లు, కొన్ని ఆడియో ఎక్విప్‌మెంట్‌ సహా పలు ఉత్పత్తులు ఇందులో ఉన్నాయి.


వీటిలోని మేగ్నట్‌ కారణంగా మెడికల్‌ పరికరాలు అంటే పేస్‌మేకర్‌,  డీఫిబ్రిలేటర్స్‌(విద్యుత్తును పంపి గుండెలో ప్రమాదకర కార్యకలాపాలను అదుపులో ఉంచేవి)పై  ప్రభావం చూపి, వాటి పనితీరును ఆటంకపర్చవచ్చు. ఆ కారణంతో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌కు దూరంగా ఉంచాల్సిన తమ 25 ప్రొడక్ట్‌ల జాబితాను విడుదల చేసింది. సురక్షిత దూరంలో ఉంచాల్సిన ఈ జాబితాలో ఎయిర్‌పాడ్స్‌, యాపిల్‌ వాచీ, హోమ్‌పాడ్‌, ఐపాడ్‌ తదితర వస్తువులు ఉన్నాయి. 


Updated Date - 2021-07-03T05:30:00+05:30 IST