అలాంటి వాడిని చెత్త నా కొ... అనక ఏం అంటారు?
ABN , First Publish Date - 2021-09-17T08:47:02+05:30 IST
‘‘చెత్తనాకొ... ఈ రోజున..
ఏం చెప్పారు... ఏం చేస్తున్నారు!
చెత్త, మరుగుదొడ్లపై పన్నులేసేవాళ్లను ఏమంటాం?
సీఎం జగన్ పాలనపై అయ్యన్న తిట్ల దండకం
గుంటూరు(ఆంధ్రజ్యోతి): ‘‘చెత్తనాకొ... ఈ రోజున రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ముఖ్యమంత్రి మద్యం, మాంసం, చేపలు అమ్ముతాడా..! చెత్త, మరుగుదొడ్లపై పన్ను వేసే వాడిని చెత్త నా కొ... అనక ఏం అంటారు?’’ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. గురువారం గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో శాసనసభ మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘తాను అధికారంలోకి వస్తే పెంచుకొంటూ పోతానని జగన్ ఎన్నికల ముందు చెప్పాడు. పెంచడం అంటే పింఛన్ కాదని ఇలా పన్నులు పెంచడం. పనికిమాలినోళ్లు పాలన చేస్తే ఇలానే ఉంటుంది. నాపై ఎన్ని కేసులు పెట్టుకొంటారో, ఏమి పీక్కుంటారో పీక్కోండి’’ అంటూ శివాలెత్తారు. ‘‘సన్న బియ్యం అంటే తెలియనోడు పౌరసరఫరాల శాఖ మంత్రి. బెట్టింగ్రాయుడు ఇరిగేషన్ మంత్రి. మీ జిల్లాకు చెందిన హోం మంత్రిని చూస్తే జాలేస్తోంది. లేని దిశ చట్టంతో ఉరిశిక్ష, జీవిత ఖైదులు వేశామని చెబుతున్నారు. లేని దిశ చట్టం కోసం ఆ నాకొ... రాజమండ్రిలో దిశ స్టేషన్ ప్రారంభించాడు. హోం మంత్రికి సిగ్గు, లజ్జ ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. కోడెల కూడా హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని, ఆయన్ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
‘‘జైలులో చిప్ప కూడు తినే నాకొ...ను తెచ్చి సీఎంని చేశాం. రూ.లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాడు. వాడబ్బ సొమ్ము తెచ్చి తీరుస్తాడా? సినిమా వాళ్ల బ్లాక్ టిక్కెట్లు కూడా సీఎం అమ్ముతాడంట. ఇంటింటికి తిరిగి మల్లెపూలు కూడా అమ్ముకోండి. దానికి అంబటి రాంబాబుని అధ్యక్షుడిని చేయండి. అంబటి, అవంతికి నిత్యం అమ్మాయిలు కావాలంట’’ అంటూ అయ్యన్న ఆరోపణలు చేశారు.