Badvel ఉప ఎన్నిక ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-30T12:52:44+05:30 IST

బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు

Badvel ఉప ఎన్నిక ప్రారంభం

కడప: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. బద్వేల్‌ ఉపఎన్నిక మొత్తం 15 మంది బరిలో అభ్యర్థులు ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,12,730 మంది ఓట్లరు ఉండగా, ఇందులో పురుషులు 1,06,650 ఉండగా, మహిళలు 1,06,069 మంది, ఇతరులు 20 ఉన్నారు. ఓటు వేసేందుకు ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరని అధికారులు సూచించారు. పోలింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తోపాటు వెబ్‌క్యాస్టింగ్‌ చేస్తునట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్‌ వెల్లడించారు.

బద్వేలు ఉప ఎన్నికకు 3 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 221 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-10-30T12:52:44+05:30 IST