Abn logo

బనానా ఐస్‌క్రీం

కావలసినవి : అరటిపండ్ల గుజ్జు - ఒక కప్పు, క్రీమ్‌ - ఒక కప్పు, పాలు - అరకప్పు, కోడిగుడ్డు - ఒకటి, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌, బిస్కెట్లు - కొన్ని.


తయారీ విధానం: ఒక బౌల్‌లో అరటిపండ్ల గుజ్జు తీసుకుని అందులో నిమ్మరసం, వెనీలా, పందచార, పాలు, కోడిగుడ్డు వేసి కలపాలి. బిస్కెట్లను పొడిపొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. క్రీమ్‌ పలుచగా అయ్యేలా బీటర్‌తో కలపాలి. తరువాత అరటిపండ్ల మిశ్రమం వేయాలి. ఒక గ్లాస్‌ బౌల్‌లో క్రీమ్‌ మిక్సర్‌ను ఒక లేయర్‌లా వేసి, పైన కుకీస్‌ వేయాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా అందించాలి.


ఎండుఫలం మిల్క్‌షేక్‌కివి మింట్‌ లెమనేడ్‌ఫలూదావాటర్‌మెలన్‌ ఐస్‌క్రీంమ్యాంగో ఐస్‌క్రీంఅవకాడో ఐస్‌క్రీంస్ట్రాబెర్రీస్‌ ఐస్‌క్రీంఅప్రికాట్‌ ఐస్‌క్రీంకీరదోస - తులసి పానీయంమ్యాంగో లస్సీ
Advertisement
Advertisement