అమరావతి: సీఎం జగన్, ఆయన బావ బ్రదర్ అనిల్ తీరు వల్లే.. రాష్ట్రంలో హిందూమతంపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో మతమార్పిడులు యథేచ్చగా సాగుతున్నాయనడానికి.. పాస్టర్ ప్రవీణ్ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రవీణ్‌లాంటి వారిని రాష్ట్రంపైకి వదిలేస్తే ప్రమాదకరమని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి అండతో.. ఏపీలో మతమారణహోమం సృష్టించాలని జగన్ చూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు.