Abn logo
Feb 13 2020 @ 10:35AM

భార్యభర్తల మధ్య గొడవ.. మామ హత్య

బెంగళూరు : దంపతుల గొడవపడుతుండగా సర్దుబాటు చేసేందుకు వెళ్ళిన మామ ( మహిళ తండ్రి) హత్యకు గురైన సంఘటన మైసూరులో చోటు చేసుకుంది. ఉదయగిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గౌసియానగర్‌ నివాసి ఆటో డ్రైవర్‌ సలీం (50) కుమార్తెతో  కొన్నేళ్ల క్రితం పెయింటర్‌ నదీంకు వివాహమైంది. నదీంకు భార్యపై అనుమానం ఉండడంతో తరచూ గొడవలు సాగుతుండేవి. పలుమార్లు సలీం మధ్యవర్తిగా వెళ్ళి రాజీ కుదిర్చారు. ఇలా బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ సాగుతుండడంతో మరోసారి సలీం జోక్యం చేసుకుని ఇరువురిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. ఆవేశంలో భార్యను చాకుతో పొడిచేందుకు నదీం దూసుకెడుతుండగా అడ్డుకునేందుకు సలీం యత్నించారు. అంతలోనే నదీం చాకుతో మామ సలీం గొంతుభాగంలో తీవ్రంగా దాడి చేయడంతో సలీం మృతి చెందాడు.   కేసు దర్యాప్తులో ఉంది.  

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement
Advertisement