బ్యాంక్ అకౌంట్‌ క్లోజైందా... ఇలా రీ యాక్టివేట్ చేసుకోవచ్చు...

ABN , First Publish Date - 2021-01-11T23:15:04+05:30 IST

అకౌంట్ పని చేయడం లేదా ? లాక్ పడిపోయిందా ? ఫ్రీజ్ అయ్యిందా ? అయినా... ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతేకాదు... బ్యాంక్‌కు వెళ్లి ఆ ఖాతాను మళ్లీ రీ యాక్టివేట్ చేసుకోవచ్చు. వివరాలిలా ఉన్నాయి.

బ్యాంక్ అకౌంట్‌ క్లోజైందా... ఇలా రీ యాక్టివేట్ చేసుకోవచ్చు...

హైదరాబాద్ : అకౌంట్ పని చేయడం లేదా ? లాక్ పడిపోయిందా ? ఫ్రీజ్ అయ్యిందా ? అయినా... ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  అంతేకాదు...  బ్యాంక్‌కు వెళ్లి ఆ ఖాతాను మళ్లీ రీ యాక్టివేట్ చేసుకోవచ్చు. వివరాలిలా ఉన్నాయి. 


బ్యాంక్ అకౌంట్‌ను దీర్ఘకాలంపాటు ఉపయోగించకపోతే అకౌంట్ డార్మెంట్ అకౌంట్‌ కిందకు వెళ్లిపోతుందన్న విషయం తెలిసిందే. అంటే అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు ఆందోళన చెందనక్కర్లేదు. ఇలాంటి ఖాతాల్లో ఉన్న డబ్బులను కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.


బ్యాంకుల్లో ఇలాంటి అన్‌క్లెయిమ్డ్ అకౌంట్లు పెరుగుతూనే వస్తున్నాయి. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్... ఇలా ఎందులోనైనా అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ ఉండొచ్చు. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు వారి ఖాతాల్లో పదేళ్లపాటు ఎలాంటి లావాదేవీలనూ నిర్వహించకపోతే అప్పుడు ఆ ఖాతాల్లోనిని డబ్బు అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ అవుతుంది. ఇలా... 2019 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకుల్లో రూ. 18,380 కోట్ల అన్‌క్లెయిమ్డ్ సొమ్ముంది.


అన్‌క్లెయిమ్డ్ సొమ్మును తీసుకునేందుుగానూ... ముందుగా సంబంధిత బ్యాంకు శాఖకు మెయిల్ పంపించి, ఇన్‌యాక్టివ్‌లో ఉన్న ఖాతాను రీయాక్టివ్ చేయాల్సిందిగా కోరాలి. దీనికిగాను... ఐడీ కార్డు, అడ్రస్ ప్రూఫ్ వంటివి అందించాలి. ఇలా రిక్వెస్టె పెట్టుకున్న కొన్ని రోజుల తర్వాత ఖాతా  రీయాక్టివేట్ అవుతుంది.


ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపధ్యంలో ఆన్‌లైన్‌లో కేవైసీ బ్యాంకులు అప్‌డేట్ చేయకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో... మనమే బ్యాంక్‌కు స్వయంగా వెళ్లాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ అయితే డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు ఉంది.

Updated Date - 2021-01-11T23:15:04+05:30 IST