Abn logo
Sep 12 2021 @ 21:16PM

అప్పు తీసుకుంటారా?.. లేదా?.. ఏపీ ప్రభుత్వానికి బ్యాంకుల లేఖ

అమరావతి: ఉద్యోగులకు జీతాలు, తీసుకున్న రుణాలకు వడ్డీల చెల్లింపులు వంటి ప్రతీనెల అవసరమై ఏ నిధుల కోసం అప్పు  చేసేందుకు ఏపీ ప్రభుత్వం చెప్పులు అరిగేలా తిరుగుతోంది. అమరావతి విషయంలో ఇస్తామన్న రుణాన్ని కూడా అందుకునేందుకు వెనక్కి వెళుతోంది. చివరకు విసిగిపోయిన బ్యాంకుల కన్సార్టియమ్ రుణం తీసుకుంటారా? లేదా?  అని తేల్చి చెప్పాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. గత లేఖలకు స్పందన లేకపోవడంతో ఇదే చివర లేఖ అని హెచ్చరించింది. ఇప్పటికే 90 శాతం పూర్తి అయిపోయి నిరుపయోగంగా ఉన్న భవనాలను ఉపయోగంలోకి తెచ్చేందుకు కూడా ప్రభుత్వానికి మనసు రావడంలేదు.