బార్బీ గాళ్‌.. స్టన్నింగ్‌ మ్యాన్‌

ABN , First Publish Date - 2021-06-09T05:51:25+05:30 IST

చెవులకు రింగులు... జుత్తుకు రంగులు... పొడుగ్గా పెరిగిన గోళ్లు... వాటిపై విభిన్న డిజైన్లు... ఆహార్యం చూస్తే అచ్చం అమ్మాయిని తలపిస్తాయి. కానీ అది ఆమె కాదు...

బార్బీ గాళ్‌.. స్టన్నింగ్‌ మ్యాన్‌

చెవులకు రింగులు... జుత్తుకు రంగులు... పొడుగ్గా పెరిగిన గోళ్లు... వాటిపై విభిన్న డిజైన్లు... ఆహార్యం చూస్తే అచ్చం అమ్మాయిని తలపిస్తాయి. కానీ అది ఆమె కాదు... అతడు. ఇటీవల అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన ‘ఐ హార్ట్‌ రేడియో’ మ్యూజిక్‌ అవార్డ్స్‌ రెడ్‌ కార్పెట్‌పై సిల్వర్‌ కలర్‌ అవుట్‌ఫిట్‌లో మెరిసిన అతడు ఎవరో కాదు... ప్రముఖ మ్యుజీషియన్‌ కోల్సన్‌ బెకర్‌. ఇక అతడి చేతిలో చేయి వేసి... పింక్‌ సూట్‌లో తళుక్కుమన్న హాలీవుడ్‌ నటి మేగన్‌ ఫాక్స్‌ బార్బీ గాళ్‌ను తలపించింది. టేలర్‌ స్విఫ్ట్‌వంటి పాప్‌ స్టార్స్‌ ఎందరు ఉన్నా ఆ అవార్డ్స్‌ ఫంక్షన్‌లో వీరిద్దరే ప్రధాన ఆకర్షణ.


సామాజిక మాధ్యమాలు, అంతర్జాతీయ మీడియాల్లో ఈ ఫొటోలు విస్తృతంగా తిరుగు తున్నాయి. మొన్నామధ్య భర్త బ్రియాన్‌ ఆస్టిన్‌ గ్రీన్‌తో బంధాన్ని తెంచుకున్న మేగన్‌ ఫాక్స్‌... ప్రస్తుతం కోల్సన్‌ సాంగత్యాన్ని ఆస్వాదిస్తోంది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని సాగుతున్న ఊహాగానాలకు ఒక్కటిగా వచ్చి ఇలా ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చిందీ కొత్త జంట.

Updated Date - 2021-06-09T05:51:25+05:30 IST