క్రెజికోవా ‘డబుల్‌’ ధమాకా

ABN , First Publish Date - 2021-06-14T09:41:55+05:30 IST

చెక్‌ సుందరి బర్బోరా క్రెజికోవా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అరుదైన ఘనత సాధించింది.

క్రెజికోవా ‘డబుల్‌’ ధమాకా

చెక్‌ సుందరి బర్బోరా క్రెజికోవా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అరుదైన ఘనత సాధించింది.  తొలిసారిగా మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచిన మర్నాడే డబుల్స్‌ టైటిల్‌ను కూడా ఖాతాలో వేసుకుంది. దీంతో 2000లో మేరీ పియర్స్‌ (ఫ్రాన్స్‌) తర్వాత ఒకే ఏడాది రెండు ఫ్రెంచ్‌ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న క్రీడాకారిణిగా నిలిచింది. ఓవరాల్‌గా ఈ  ఫీట్‌ సాధించిన ఏడో ప్లేయర్‌. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ క్రెజికోవా-సినియాకోవా (చెక్‌) జోడీ 6-4, 6-2తో ఇగా స్వియటెక్‌ (పోలెండ్‌)-బెతానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా) జంటను ఓడించింది. క్రెజికోవా-సినియాకోవా జోడీకి డబుల్స్‌లో ఇది మూడవ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కావడం విశేషం. 2013లో బాలికల డబుల్స్‌తో పాటు 2018లోనూ మహిళల డబుల్స్‌లో వీరు విజేతలుగా నిలిచారు. 



Updated Date - 2021-06-14T09:41:55+05:30 IST