అమెరికన్ బిలియనీర్ రూ.1900కోట్లతో నిర్మించిన‌ అద్భుత క‌ళాఖండం ఇది!

ABN , First Publish Date - 2021-05-21T20:09:39+05:30 IST

అమెరికన్ బిలియనీర్ బారీ డిల్లర్ భారీ వ్య‌యంతో ఓ అద్భుత క‌ళాఖండాన్ని సృష్టించారు.

అమెరికన్ బిలియనీర్ రూ.1900కోట్లతో నిర్మించిన‌ అద్భుత క‌ళాఖండం ఇది!

మాన్హాటన్‌: అమెరికన్ బిలియనీర్ బారీ డిల్లర్ భారీ వ్య‌యంతో ఓ అద్భుత క‌ళాఖండాన్ని సృష్టించారు. మాన్హాటన్‌లోని హడ్సన్ నదిపై ఏకంగా 260 మిలియ‌న్ డాల‌ర్ల‌(సుమారు రూ.1900కోట్లు)తో స‌ర్వాంగ సుంద‌రంగా ఒక ప‌బ్లిక్ పార్క్‌ను నిర్మించాడు. 'లిటిల్ ఐలాండ్' పేరిట నిర్మిత‌మైన ఈ పార్క్ శుక్ర‌వారం(మే 21న‌) గ్రాండ్‌గా ఓపెన్ అయింది. నీటి మ‌ధ్య‌లో నిర్మించిన ఈ పార్క్ కోసం పుల రేకుల‌ను పోలిన‌(తులీప్స్‌) 132 కాంక్రీట్ స్తంభాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.


రెండు వంతెనలు ఈ నిర్మాణాన్ని నదికి కలుపుతున్నాయి. ఇక 2.4 ఏక‌రాల్లో నిర్మిత‌మైన‌ ఈ పార్క్‌లో 687 మంది కూర్చునే సామ‌ర్థ్యం గ‌ల‌ యాంఫిథియేటర్, 65 రకాల పొదలు, 290 రకాల గడ్డి, తీగలు ఉన్నాయి. కాగా, ఈ పార్కులో సంద‌ర్శ‌కుల‌ను ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు తెల్ల‌వారుజామున ఒంటి గంట వ‌ర‌కు ప్ర‌వేశానికి అనుమ‌తి ఉంటుంది. 2013లో పార్కు నిర్మాణం ప్రారంభించ‌గా.. సుమారు ఏడేళ్ల త‌ర్వాత ఇది పూర్తైంది.          





Updated Date - 2021-05-21T20:09:39+05:30 IST