Abn logo
Apr 10 2020 @ 04:16AM

టాప్‌ సెల్లర్‌గా బ్రయాంట్‌ నవల

వాషింగ్టన్‌: బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబి బ్రయాంట్‌ రాసిన స్పోర్ట్స్‌ ఫాంటసీ నవల ‘ద విజెనార్డ్‌ సిరీస్‌: సీజన్‌ 1’ టాప్‌ సెల్లర్‌గా నిలిచింది. ద న్యూయార్క్‌ టైమ్స్‌ మిడిల్‌ గ్రేడ్‌ హార్డ్‌ కవర్‌ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. బాలల బాస్కెట్‌బాల్‌ పుస్తకాల్లో అమెజాన్‌ బెస్ట్‌ సెల్లర్‌గానూ చోటు దక్కించుకుంది. హెలికాప్టర్‌ ప్రమాదంలో బ్రయాంట్‌, అతడి కుమార్తె మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement