జీవితం ఓ అద్భుత పుస్తకం:బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ రాములు

ABN , First Publish Date - 2021-11-30T23:34:57+05:30 IST

ప్రతి వ్యక్తి జీవితం ఓ అద్భుత పుస్తకం వంటిదని..అందుకే నిత్య విద్యార్థి గా ఉండగలిగే అధ్యయన సామర్థ్యం కలిగి ఉండాలని బీ సీ కమిషన్ మాజీ ఛైర్మన్ బీఎస్ రాములు అన్నారు

జీవితం ఓ అద్భుత పుస్తకం:బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ రాములు

హైదరాబాద్: ప్రతి వ్యక్తి జీవితం ఓ అద్భుత పుస్తకం వంటిదని..అందుకే నిత్య విద్యార్థి గా ఉండగలిగే అధ్యయన సామర్థ్యం కలిగి ఉండాలని బీ సీ కమిషన్ మాజీ ఛైర్మన్ బీఎస్ రాములు అన్నారు.ఆరోగ్య రీత్యా ఇటీవలే గుండె కు చికిత్స చేసుకున్న బీఎస్ రాములు ను బీ సీ ఉద్యోగుల జాక్ గ్రేటర్ అధక్షులు, టీ పో పా ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ కలసి పరామర్శించారు.ఈ సందర్భంగా బీ ఎస్ రాములు మాట్లాడుతూ పుస్తక పఠనం ఓ ఉత్తమ వ్యాపకం అని అభిప్రాయ పడ్డారు. అలాగే అది వ్యసనం ఐనా విషయ పరిజ్ఞానం అనంతం గా సంగ్రహించి జ్ఞానాన్ని కలిగిన జ్ఞాని గా వ్యక్తిని తేజోమయం చేస్తుందని స్పష్టం చేశారు.


బీ ఎస్ రాములుకు ఇటీవలే స్టంట్ లు వేశారు.ఈ విషయం తెలిసి ఆయన సాహిత్యం పై పరిశోధన పత్రం సమర్పించి డాక్టరేట్ పొందిన నిజామాబాద్ ఉపాధ్యాయురాలు అన్నందాస్ జ్యోతీ బీ ఎస్ రాములు ను కలిశారు.ఈ సందర్భంగా వారి కుమార్తె జాహ్నవి , తనకు గ్రూప్స్ కు సన్నధం కావాలని ఉందన్న ఆశయం వ్యక్త పరచగా,ఆమె అభిలాష నెరవేరాలని ఆశీర్వదించారు, తగు సాయం చేయాలని బీ సీ స్టడీ సర్కిల్ వారికి సూచించారు.వెనక బడిన తరగతుల కు చెందిన విద్యార్థులు నిరుద్యోగులు సరైన అవకాశాలను అందుపుచ్చుకొని ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు.

Updated Date - 2021-11-30T23:34:57+05:30 IST