గాంధీ ఆస్పత్రిలో బెడ్లు ఫుల్
ABN , First Publish Date - 2021-04-29T15:30:53+05:30 IST
హైదరాబాద్: కరోనా మహమ్మారి తెలంగాణలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో తగ్గినట్టే తగ్గి సెకండ్ వేవ్ రూపంలో
హైదరాబాద్: కరోనా మహమ్మారి తెలంగాణలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో తగ్గినట్టే తగ్గి సెకండ్ వేవ్ రూపంలో కొన్ని రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోంది. దీంతో గాంధీ ఆస్పత్రిలో బెడ్లు ఫుల్ అయ్యాయి. చివరకు ఐసీయూ సైతం నిండిపోయింది. ఐసీయూలో 625 బెడ్లు ఉండగా.. మొత్తం ఫుల్ అయిపోయాయి. ఇక 1256 ఆక్సిజన్ బెడ్లు ఉండగా అవి కూడా నిండిపోవడంతో గాంధీ సిబ్బంది కరోనా రోగులను కింగ్ కోఠి, టిమ్స్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప గాంధీకి రావద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు.