బీట్‌రూట్ రసం... మేని మెరుపు కోసం...
ABN , First Publish Date - 2020-10-11T05:30:00+05:30 IST
‘‘ముఖం తాజాగా, కాంతిమంతంగా కనిపించేందుకు ఖరీదైన సౌందర్య సాధనాలు వాడాలనే నియమం ఏమీ లేదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా కూడా చర్మం సోయగాన్ని పెంచుకోవచ్చు’’ అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లవ్‌నీత్ బత్రా. సౌందర్యం పెరగడానికి ఆమె ఏం చెబుతున్నారంటే...

బీట్‌రూట్, కొత్తిమీర, ఉసిరి వీటిని మిక్సీలో వేసి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. ఈ రసంలోని గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఉసిరిలోని విటమిన్ సి ముఖం మీది మచ్చలు, ముడతలను పోగొడుతుంది. చర్మానికి తేమను అందిస్తుంది. ఈ మూడిటితో తయారుచేసిన రసంలో బీటాలైన్స్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒంట్లోని విషపదార్థాలను తొలగిస్తాయి. వ్యాయామం చేశాక బీట్‌రూట్ జ్యూస్ తాగితే అలసట తగ్గిపోతుంది. కండరాలు సాంత్వన పొందుతాయి.