Abn logo
Aug 1 2021 @ 03:55AM

బెలిండాకు మహిళల స్వర్ణం

మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌ స్వర్ణాన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన బెలిండా బెన్సిక్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో బెలిండా 7-5, 2-6, 6-3తో వోండ్రాసోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించింది. స్విటోలినా (ఉక్రెయిన్‌)కు కాంస్యం దక్కింది. సింగిల్స్‌లో విజేతగా నిలిచిన బెన్సిక్‌.. తన దేశానికి చెందిన విక్టోరియా గోలుబిచ్‌తో కలిసి డబుల్స్‌లోనూ ఫైనల్‌ చేరి తన ఆనందాన్ని రెట్టింపు చేసుకుంది. ఫైనల్లో బెన్సిక్‌ జోడీ.. టాప్‌సీడ్‌, చెక్‌ జంట క్రెజికోవా-సినియకోవాతో తలపడనుంది.