‘క్యూఆర్‌ కోడ్‌’తో మహిళలకు సత్వర సేవలు.. పోలీసుకమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌

ABN , First Publish Date - 2021-04-18T05:28:18+05:30 IST

క్యూఆర్‌ కోడ్‌ ద్వారా మహిళలకు, సత్వరమే సేవలు అందించే అవకాశం ఉంటుందని పోలీసుకమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌ పేర్కొన్నారు.

‘క్యూఆర్‌ కోడ్‌’తో మహిళలకు సత్వర సేవలు.. పోలీసుకమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న పోలీస్‌ అధికారులు

పోలీస్టేషన్‌కు రాకుండానే ఫిర్యాదు చేసే అవకాశం

ఖమ్మం పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌ 

ఖమ్మంక్రైం, ఏప్రిల్‌ 17: క్యూఆర్‌ కోడ్‌ ద్వారా మహిళలకు, సత్వరమే సేవలు అందించే అవకాశం ఉంటుందని పోలీసుకమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు భరోసా కలిపిస్తున్న పోలీసుశాఖ రాష్ట్ర డీజీపీ మహేంద్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళ భద్రత విభాగం అందుబాటులోకి తెచ్చిన క్యూఆర్‌ కోడ్‌కు సంబంధించిన స్టిక్కర్లను షీటీమ్‌ ఆధ్వర్యంలో సీపీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మహిళల వేధింపులకు గురైనా, సైబర్‌నేరాలకు గురైనా పోలీసుస్టేషన్‌కురాకుండా ఉన్నచోటు నుంచే క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఫిర్యాదు చేసుకునే అకవాశం ఉందని, దీనిని మహిళలు సద్వినియోగించుకోవాలన్నారు. క్యూఆర్‌ కోడ్‌ లింక్‌ను సెల్‌ఫోన్‌లో భద్రపరుచుకుని, అవసరమైనప్పుడు ఆలింకులను తెరవగానే క్యూఆర్‌ కోడ్‌ వస్తుందని, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు వస్తాయని తెలిపారు. ఆ దరఖాస్తును నింపి పంపగానే సంబంధిత షీటీమ్‌ పోలీసులకు సమాచారం వెళుతుందని తెలిపారు. తద్వారా పోలీసు అధికారులు స్పందించి వెంటనే దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ విధానం ద్వారా మహిళలకు మరింత నాణ్యమైన, సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని సీపీ తెలిపారు. 


Updated Date - 2021-04-18T05:28:18+05:30 IST