పేదలకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ సాయం

ABN , First Publish Date - 2020-04-05T20:28:45+05:30 IST

లాక్ డౌన్ పరిణామాలతో పేదలను ఆదుకునేందుకు దివంగత టీడీపీ నేత ఎర్రంనాయుడు..

పేదలకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ సాయం

శ్రీకాకుళం: లాక్ డౌన్ పరిణామాలతో పేదలను ఆదుకునేందుకు దివంగత టీడీపీ నేత ఎర్రంనాయుడు స్థాపించిన భవానీ చారిటబుల్ ట్రస్ట్ విస్తృత సేవలు అందిస్తోంది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నేతృత్వంలోని యువత పెద్ద ఎత్తున ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. ప్రతిరోజూ 3వేల మందికి ఆహారాన్ని సమకూరుస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ సిబ్బంది పోలీసులతోపాటు శరణార్థులకు రెండుపూట్ల అన్నం పెడుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు భోజనం లేదనే మాట వినిపించకూడదనేది భవానీ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న ప్రయత్నమిది.


ఈ సందర్బంగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పేదలకు అన్నదానం చేద్దామనే అలోచన చేశారన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో ఆయన మాట్లాడి పర్మిషన్ తీసుకున్నారన్నారు. ముఖ్యంగా కరోనా నివారణ కోసం పోలీసులు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది చాలా కష్టపడుతున్నారని, వాళ్లకూ భోజనం అందించాలనే ఆలోచన వచ్చిందన్నారు. నాలుగు వందలతో మొదలుపెట్టి.. ఇప్పటివరకు 2,500కు పెరిగిందని చెప్పారు. ఇంకా పెంచి ఉధృతంగా సేవా కార్యక్రమాలు చేద్దామని ఆలోచిస్తున్నామని సభ్యులు తెలిపారు.


Updated Date - 2020-04-05T20:28:45+05:30 IST