Abn logo
Oct 24 2021 @ 04:07AM

సెట్‌లో చిల్‌ అవుతున్నారు

భీమ్లానాయక్‌, డేనీ శేఖర్‌ షూటింగ్‌కు చిన్న బ్రేక్‌ ఇచ్చి సెట్‌లో సేద తీరుతున్నారు. పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘భీమ్లానాయక్‌’ నుంచి పవన్‌, రానా వర్కింగ్‌ స్టిల్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అందులో పవన్‌ కల్యాణ్‌ నులక మంచంపైన, రానా ఎడ్లబండిపైన సేదతీరుతున్నారు. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలకానుంది.