అఖిలప్రియ కేసులో నిందితులుగా మరికొందరి పేర్లు

ABN , First Publish Date - 2021-01-15T01:06:13+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో భూమా అఖిలప్రియ పేరునే కాకుండా..

అఖిలప్రియ కేసులో నిందితులుగా మరికొందరి పేర్లు

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో భూమా అఖిలప్రియ పేరునే కాకుండా మరికొంత మంది పేర్లను కూడా నిందితులుగా చేర్చారు. భూమా జగత్‌ విఖ్యాత్‌, భార్గవ్ తమ్ముడు చంద్రహాస్, భార్గవ్ కుటుంబ సభ్యులనూ నిందితులుగా చేర్చారు. కిడ్నాప్ ప్లాన్ నుంచి నిందితులు పారిపోయే వరకు భార్గవ్ ఫ్యామిలీ సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 


ఈ కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియ జగత్ విఖ్యాత్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. జగత్ విఖ్యాత్ కారు డ్రైవర్ ఇచ్చిన కీలక సమాచారం మేరకు ఈ కేసులో జగత్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ, కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. 


ఇక ఇదే కేసులో అఖిలప్రియ మూడు రోజుల పోలీసుల కస్టడీ ముగిసింది. దీంతో ఆమెకు న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కస్టడీ ముగిసిన వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఆమెను జడ్జి ఎదుట హాజరుపర్చారు. జడ్జి రిమాండ్ విధించడంతో అఖిలప్రియను చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

Updated Date - 2021-01-15T01:06:13+05:30 IST