నీట్‌ కోచింగ్‌కు డబ్బు లేదని.. యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-03-01T08:39:19+05:30 IST

డాక్టర్‌ కావాలనేది ఆమె కల. కానీ పే దరికం ఆటంకంగా నిలిచింది.

నీట్‌ కోచింగ్‌కు డబ్బు లేదని.. యువతి ఆత్మహత్య

భూపాలపల్లి జిల్లా రేపాక గ్రామంలో ఘటన


రేగొండ, ఫిబ్రవరి28: డాక్టర్‌ కావాలనేది ఆమె కల. కానీ పే దరికం ఆటంకంగా నిలిచింది. ఎంబీబీఎస్‌ కోర్సు అర్హత పరీక్ష అయిన నీట్‌కు అవసరమైన కోచింగ్‌ తీసుకునేందుకు డబ్బు లేక ఆత్మాహత్యాయత్నం చేసిం ది. 20 రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడి సోమవారం ఈ లోకాన్ని విడిచింది. భూ పాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకలో ఈ ఘట న జరిగింది. రేపాకకు చెందిన మానస(20)తండ్రి చిన్నతనంలోనే మరణించారు. దీంతో తల్లి కోమల కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. మానస బైపీసీలో  890 మార్కులు సాధించింది. గతే డాది నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌కు వెళ్లింది. రూ. లక్షన్నర ను కోమల అప్పుగా తెచ్చి ఫీజు చెల్లించారు. కానీ ఎంబీబీఎస్‌ సీటు రాకపోవడంతో మళ్లీ కోచింగ్‌ తీసుకుంటానని మానస తల్లిని కోరింది. ఫీజుకు డబ్బు లేదని తల్లి చెప్పడంతో మనస్తాపం చెందిన మానస ఫిబ్రవరి 8న పురుగుల మందు తాగగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచింది. 

Updated Date - 2022-03-01T08:39:19+05:30 IST