మరో ఇద్దరు భారతీయ మహిళలకు కీలక బాధ్యతలు

ABN , First Publish Date - 2021-01-27T22:31:44+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించారు.

మరో ఇద్దరు భారతీయ మహిళలకు కీలక బాధ్యతలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. యూఎస్ మిషన్ టు యూఎన్‌లో లీడర్‌షిప్ పోస్టులకు సోహిని ఛటర్జీ, అదితి గోరూర్‌ను ఎంపిక చేశారు. ఈ ఇద్దరి ఎంపిక అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ల ప్రతిభావంతులైన, అనుభవజ్ఞులైన నాయకత్వాన్ని అందించడం పట్ల గల నిబద్ధతను సూచిస్తుందని ఈ సందర్భంగా యూఎస్ మిషన్ పేర్కొంది. ఇక ఛటర్జీ.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా పని చేశారు. అలాగే గోరూర్ యూఎన్ శాంతి పరిరక్షణ నిపుణురాలు. ఆమెను మిషన్ పాలసీ అడ్వైజర్‌గా నియమించారు. ఇక ఇప్పటికే 20 మంది భారతీయ అమెరికన్లను బైడెన్ తన పరిపాలన బృందంలో కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-01-27T22:31:44+05:30 IST