బైక్‌ తుప్పు పడుతోందా..!

ABN , First Publish Date - 2020-06-24T05:53:19+05:30 IST

వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బైక్‌ తుప్పు పడుతూనే ఉంటుంది. గాలిలో తేమ కారణంగా ఫైబర్‌తో కూడిన విడిభాగాలు మినహాయించి ట్యాంక్‌, రీమ్‌, బ్రేక్స్‌ దగ్గర రస్టింగ్‌ చాలా ..

బైక్‌ తుప్పు పడుతోందా..!

వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బైక్‌ తుప్పు పడుతూనే ఉంటుంది. గాలిలో తేమ కారణంగా ఫైబర్‌తో కూడిన విడిభాగాలు మినహాయించి ట్యాంక్‌, రీమ్‌, బ్రేక్స్‌ దగ్గర రస్టింగ్‌ చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. వర్షంలో తడవకపోయినా బ్రేక్‌ వేసినప్పుడు కీచుమంటూ శబ్దాలు రావడమే కాదు... బ్రేక్‌ సరిగా పడకపోయే ప్రమాదాలూ ఉన్నాయి. సో... వర్షాకాలంలో మీ బైక్‌ను రస్టింగ్‌ సమస్య నుంచి రక్షించుకోవడానికి మెకానిక్‌లు కొన్ని సూచనలు చేస్తున్నారు.

 

చికిత్స కన్నా నివారణ మేలు. బైక్‌లకూ ఇది వర్తిస్తుంది. తుప్పు పట్టాక దాన్ని వదిలించుకొనే మార్గలు వెతికే కన్నా.. సాధ్యమైనంత వరకు బైక్‌ను పార్కింగ్‌ చేసినప్పుడు వర్షంలో తడవకుండా చూసుకోవడం ఉత్తమం. ఈ మధ్య ఎలకా్ట్రనిక్‌ డిస్‌ప్లే బైక్‌లు ఎక్కువయ్యాయి. తప్పనిసరై వర్షంలో నిలపాల్సివస్తే, ఎలక్ర్టికల్‌ భాగాలు తడవకుండా కవర్‌ కప్పడం తప్పనిసరి.


బైక్‌ల్లో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే బ్రేక్‌లు, చెయిన్‌ లాంటి వాటికి తుప్పు సమస్య ఎక్కువ. వాటిని శుభ్రంగా ఉంచడంతో పాటు తప్పనిసరిగా లూబ్రికేషన్‌ చేయాలి. దీనికి మెకానిక్‌తో పనిలేదు. ఆటోమొబైల్‌ స్టోర్స్‌లో చెయిన్‌ క్లీనర్స్‌, లూబ్రికెంట్స్‌ దొరుకుతున్నాయి. 


వర్షాకాలంలో కనీసం 500 కిలోమీటర్లకు ఒకసారైనా చెయిన్‌ క్లీన్‌ చేయించుకోవడం. స్టిఫ్‌నెస్‌ పరీక్షించుకోవడం ఉత్తమం. 


బైక్‌లో తుప్పు పట్టేందుకు అవకాశం ఉన్న మరో భాగం బ్యాటరీ. బ్యాటరీ టెర్మినల్స్‌కు పెట్రోలియం జెల్లీ రాస్తే తుప్పు పట్టే అవకాశాలు తక్కువ. 


బైక్‌ ఫ్రంట్‌ సస్సెన్షన్‌పై ఉండే రబ్బర్‌ ఆయిల్‌ సీల్స్‌కు సైతం పెట్రోలియం జెల్లీ రాస్తే తుప్పు పట్టవు. అలాగే క్రోమ్‌ విడిభాగాలకు యాంటీ రస్ట్‌ సొల్యూషన్‌ రాయడం వల్ల ఫలితం ఉంటుంది. 


నిమ్మరసంతో కూడా కొంత మేరకు తుప్పు 

వదలగొట్టవచ్చు. లేదంటే బేకింగ్‌ సోడా, వెనిగర్‌ 

కలిపి కూడా క్లీన్‌ చేయవచ్చు. బైక్‌లకు వ్యాక్స్‌/ పాలిష్‌ మరో ఆప్షన్‌.

Updated Date - 2020-06-24T05:53:19+05:30 IST