బిల్‌ కలెక్టర్ల నిరసన

ABN , First Publish Date - 2020-05-28T09:54:56+05:30 IST

తాండూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ అనిల్‌కుమార్‌, బిల్‌ కలెక్టర్‌ నాగేందర్‌ను అకారణంగా

బిల్‌ కలెక్టర్ల నిరసన

తాండూరు : తాండూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ అనిల్‌కుమార్‌, బిల్‌ కలెక్టర్‌ నాగేందర్‌ను అకారణంగా దూషించారని ఆరోపిస్తూ బుధవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బిల్‌ కలెక్టర్లు, ఇతర ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి బైఠాయించారు. అనంతరం బిల్‌కలెక్టర్లతో కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి సమావేశమై పరిస్థితిపై చర్చించారు. పన్నులు వసూలు చేయాలన్నందుకే  తనపై ఆరోపణలు చేస్తున్నారని అనిల్‌కుమార్‌ పేర్కొంటుండగా, కిందిస్థాయి సిబ్బంది, సీనియర్‌ అసిస్టెంట్‌ చులకనగా చూస్తున్నారని బిల్‌ కలెక్టర్లు ఆరోపించారు. 

Updated Date - 2020-05-28T09:54:56+05:30 IST