Advertisement
Advertisement
Abn logo
Advertisement

విడాకుల ప్రకటన తర్వాత.. బిల్‌గేట్స్ గురించి బయటకు వచ్చిన షాకింగ్ నిజం!

మాజీ ప్రేయసిని ఏడాదికి ఒకసారి కలిసేందుకు భార్య మిలిందాతో బిల్ ఒప్పందం!

న్యూయార్క్‌: మైక్రోస్టాఫ్‌ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌(65).. ఆయన భార్య మిలిందా గేట్స్(56) తమ 27 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్చపరిచారు. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా బిల్‌గేట్స్ గురించి ఓ షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అదేంటంటే.. మిలిందా కంటే ముందు బిల్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉండేద‌ట‌. ఆమె పేరు అన్ విన్‌బ్లాడ్. మిలిందాతో పెళ్లికి ముందు బిల్.. విన్‌బ్లాడ్‌తో డేటింగ్ చేశారట. ఇద్దరూ కలిసి బాగా తిరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో బిల్‌కు మిలిందాతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. దాంతో 1994లో వివాహబంధంతో ఒక్కటైందీ జంట. 


ఆ సమయంలో బిల్‌గేట్స్ మిలిందాతో ఓ విచిత్రమైన ఒప్పందం చేసుకున్నారట. ఏడాదికి ఒకసారి తన మాజీ ప్రేయసి విన్‌బ్లాడ్‌ను కలిసే అవకాశం ఇవ్వాలనేది ఆ అగ్రీమెంట్. 1997 వరకు కూడా ఈ ఒప్పందం కొనసాగినట్లు ప్రముఖ అమెరికన్ జర్నలిస్ట్ వాల్టర్ ఐజాక్సన్ తెలిపారు. ప్రతియేటా నార్త్ కరోలినాలోని విన్‌బ్లాడ్‌‌కు చెందిన బీచ్ కాటేజ్‌లో ఇద్దరూ కలుసుకునేవారట. వారం రోజుల పాటు చాలా సంతోషంగా గడిపేవారట. ఆ సమయంలో బీచ్ వెంబడి ఇద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకుని తెగ తిరిగేవారని ఐజాక్సన్ చెప్పారు. అయితే, 1997 తర్వాత నుంచి బిల్, మిలిందాల ఈ ఒప్పందం కొనసాగిందా? లేదా? అనేది తెలియదని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు మిలిందాను పెళ్లాడే విషయమై బిల్ తన ప్రేయసి విన్‌బ్లాడ్ అభిప్రాయం కూడా తీసుకున్నారట. మీ ఇద్దరి జంట చాలా బాగుంటుందని ఆమె చెప్పడంతోనే మిలిందాను బిల్ పెళ్లాడినట్టు సమాచారం. ఇక బిల్, మిలిందాల విడాకుల ప్రకటన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన ఈ న్యూస్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.     

Advertisement
Advertisement