సంపన్న ఖాతాదారులకు... బిట్ కాయిన్ ఫండ్స్...

ABN , First Publish Date - 2021-03-19T22:43:59+05:30 IST

బిట్ కాయిన్ ఫండ్స్ కు సంబంధించి... తన వెల్త్ మేనేజ్‌మెంట్ క్లయింట్స్‌కు... అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ యాక్సెస్ ఇస్తోంది.

సంపన్న ఖాతాదారులకు... బిట్ కాయిన్ ఫండ్స్...

న్యూయార్క్ : బిట్ కాయిన్ ఫండ్స్ కు సంబంధించి...   తన వెల్త్ మేనేజ్‌మెంట్ క్లయింట్స్‌కు... అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ యాక్సెస్ ఇస్తోంది. ఈ మేరకు మోర్గాన్ స్టాన్లీ తన ఆర్ధిక సలహాదారులకు సూచనలు చేసింది. మోర్గాన్ స్టాన్లీ తీసుకున్న ఈ చర్యను... ప్రపంచంలోని ఈ అతిపెద్ద క్రిప్టోకరెన్సీకి మరింత దూకుడును పెంచే చర్యగా ంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. 


కాగా... సంపన్న ఖాతాదారులకు మాత్రమే బిట్ కాయిన్ ఫండ్స్‌ను యాక్సెస్ చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు వీలు కల్పిస్తోంది. అర్హత సాధించిన అమెరికా పెట్టుబడిదారులకు కూడా మోర్గాన్ స్టాన్లీ బిట్ కాయిన్ పెట్టుబడులను వారి మొత్తం నికరవిలువలో 2.5 శాతానికి పరిమితం చేస్తుందని సమాచారం. 


ఇదిలా ఉంటే... భారత్‌లో బిట్ కాయిన్‌ను నిషేధించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అన్ని క్రిప్టోకరెన్సీలను బ్యాన్ చేసే ఆలోచన లేదని ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టం చేశారు. కాగా... క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయని, కానీ సాధ్యపడడంలేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. 

Updated Date - 2021-03-19T22:43:59+05:30 IST