ఇసుక విధానంలో వైసీపీ ప్రభుత్వం విఫలం: తిరుపతిరావు

ABN , First Publish Date - 2020-06-05T15:13:31+05:30 IST

ఇసుక విధానంలో వైసీపీ ప్రభుత్వం విఫలం: తిరుపతిరావు

ఇసుక విధానంలో వైసీపీ ప్రభుత్వం విఫలం: తిరుపతిరావు

అమరావతి: స్థానిక ఎన్నికల్లో లబ్దిపొందాలనే ఉద్దేశంతోనే ఇళ్ల స్థలాల పేరుతో... వైసీపీ ఆదరాబాదరాగా ముందుకెళ్లిందని బీజేపీ నేత తిరుపతిరావు విమర్శించారు. ఏబీఎన్ డిబేట్‌లో మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దళితుల భూములు తీసుకుంటున్నారని మండిపడ్డారు. పేదల భూములకు తక్కువ రేటు ఇస్తున్నారని... వైసీపీ నేతల భూములకు ఎక్కువ రేటు చెల్లిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇళ్ల స్థలాలకు భూమి సేకరణలో పారదర్శకత లేదన్నారు. ఇసుక విధానంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఆన్‌లైన్‌లో ఇసుక దొరకదని, ఆఫ్‌లైన్‌లో ధర ఎక్కువ చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖలో ఇసుక స్మగ్లింగ్‌ జరుగుతోందని..ప్రభుత్వానికి తెలిసే ఇసుక దందా జరుగుతోందన్నారు. సాండ్‌ స్మగ్లింగ్‌లో పెద్ద పెద్ద రాజకీయ నేతలున్నారన్నారు. పెద్దల అండ వల్లే ఇసుక లారీలను పోలీసులు ఆపరని తిరుపతిరావు తెలిపారు. 

Updated Date - 2020-06-05T15:13:31+05:30 IST