Abn logo
Sep 16 2021 @ 17:44PM

రేప్‌లకు అడ్డాగా తెలంగాణ గడ్డ: ఎమ్మెల్యే రాజసింగ్

హైదరాబాద్: దేశంలో రేప్‌లకు అడ్డాగా తెలంగాణ గడ్డ మారిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణ పోలీసులపై రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల భద్రత కాదు,  పోలీస్ బాస్‌ల ప్రాధాన్యతలు వేరే ఉన్నాయని ఆయన ఆరోపించారు.  ప్రమోషన్ల‌ కోసం అధికార పార్టీకి కొందరు పోలీస్ అధికారులు గులాంగిరీ చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ మాత్రమే కాదు, అన్ని ప్రాంతాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ పోలీసులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. నైట్ పెట్రోలింగ్‌ను సైతం పోలీసుల సక్రమంగా నిర్వహించటంలేదని ఎమ్మెల్యే రాజసింగ్ ఆరోపించారు. 

ఇవి కూడా చదవండిImage Caption