Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 30 2021 @ 16:56PM

ఎంఐఎం నేతలను పాకిస్తాన్‌కు పంపిస్తాం: ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నగరంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా యాత్రలో పాల్గొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఓవైసీ సోదరులపై వ్యాఖ్యలు చేశాడు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎంఐఎం నేతలను పాకిస్తాన్‌కు పంపిస్తామని రాజాసింగ్ అన్నారు. పాతబస్తీలో బీజేపీ సభ నిర్వహిస్తే ఓవైసీ సోదరులు ఏం పీకారని ప్రశ్నించారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్ల పట్టుకోవటం ఎంఐఎంకు అలవాటని ఆయన ఘాటుగా విమర్శించారు.


గోషామహల్ నియోజకవర్గ అభివృద్ధికి రెండు వేల కోట్లు ఇస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. గోషామహాల్‌లో కేసీఆర్ డబ్బు గెలుస్తోందో.. నేను గెలుస్తానో చూద్దాం అని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో గెలిచేది డబ్బులు కాదని, అక్కడ గెలిచేది ఈటల రాజేందర్ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పది వేలను తీసుకుని బీజేపీకి ప్రజలు ఓటు వేశారన్నారు. తెలంగాణను కేసీఆర్ మత్తుల తెలంగాణగా మార్చాడని రాజసింగ్ ఆరోపించారు. 

Advertisement
Advertisement