హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా ఆందోళన
ABN , First Publish Date - 2021-08-04T21:40:15+05:30 IST
హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు విడుదల
హైదరాబాద్: హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు విడుదల చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి మహిళ దూసుకెళ్లింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను వెంటనే అరెస్ట్ చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించారు. మూడేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పెండింగ్‌లో పెట్టారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.