Advertisement
Advertisement
Abn logo
Advertisement

వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరి జిల్లాగా మార్చాలి: సంజయ్‌

వికారాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా వికారాబాద్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరి జిల్లాగా మార్చాలని సంజయ్‌ డిమాండ్ చేశారు. మోదీని కేసీఆర్ కలుస్తాడు, కానీ తన మంత్రులను, ఎంపీలను కలవడని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ తల్లి మూర్ఖుని పాలనలో బందీ అయ్యిందని సంజయ్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement