సిక్కోలులో బ్లాక్‌ ఫంగస్‌?

ABN , First Publish Date - 2021-05-15T09:42:08+05:30 IST

శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం బ్లాక్‌ ఫంగస్‌ అనుమానిత కేసు బయటపడడం కలకలం రేపింది. నరసన్నపేట మండలానికి చెందిన వ్యక్తి (55) కొద్దిరోజుల క్రితం కొవిడ్‌ బారినపడ్డారు.

సిక్కోలులో బ్లాక్‌ ఫంగస్‌?

నరసన్నపేట, మే 14: శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం బ్లాక్‌ ఫంగస్‌ అనుమానిత కేసు బయటపడడం కలకలం రేపింది. నరసన్నపేట మండలానికి చెందిన వ్యక్తి (55) కొద్దిరోజుల క్రితం కొవిడ్‌ బారినపడ్డారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొంది వారం రోజుల కిందట కోలుకున్నారు. నెగిటివ్‌ రావడంతో డిశ్చార్జి అయ్యారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ఆయనలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు గుర్తించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

Updated Date - 2021-05-15T09:42:08+05:30 IST