బ్రహ్మాండనాయకుడికి బ్రహ్మోత్సవం

ABN , First Publish Date - 2021-04-14T05:32:41+05:30 IST

జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం ప్లవనామ ఉగాది పర్వదినా న్ని పురస్కరించుకొని మంగళవారం స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

బ్రహ్మాండనాయకుడికి బ్రహ్మోత్సవం
పుణ్యనదీజలాలను ఆలయంలోకి తీసుకువస్తున్న దృశ్యం

జమలాపురం వేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు 

ఉగాది సందర్భంగా అంకురార్పణ చేసిన అర్చకులు

ఎర్రుపాలెం, ఏప్రిల్‌ 13: జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం ప్లవనామ ఉగాది పర్వదినా న్ని పురస్కరించుకొని మంగళవారం స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4గంటలకు స్వామివారికి సర్వాంగా భిషేకాలు నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారు, అమ్మవా ర్లకు నూతన వస్త్రాలను అలంకరించారు. అనంతరం నింబకుసుమ ప్రసాదం(వేపపువ్వు) నివేదించి వితరణ చేశారు. సాయంత్రం 4.5గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పుణ్యనదీజలాలను తీర్థపు బిందెలో తీసుకువచ్చి సమర్పించారు. విఘ్నేశ్వరపూజ, రక్షాబంధన పూజ, కలశస్థాపన వంటి వైదిక క్రయలు అర్చకులు నిర్వహించారు. ఉత్సవ ప్రారంభ వేడుకగా జ్యోతిప్రజ్వలన నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని పాల్గొని పూజలు చేశారు. జమలాపురం గ్రామానికి చెందిన వాసిరెడ్డి సురేష్‌, వెంకట్‌, అనిల్‌ సోదరులు స్వామివారికి రెండున్నర కిలోల వెండి దీపకుందులు సమర్పించారు. కార్యక్రయంలో ఆలయ ఈవో కె.జగన్మోహ న్‌రావు, చైర్మన్‌ కృష్ణమోహన్‌శర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్‌శర్మ, సిబ్బంది విజయకుమారి, సోమయ్య, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-14T05:32:41+05:30 IST