బ్రేకింగ్ : పాలనావికేంద్రీకరణపై కాసేపట్లో మరో బిల్లు.. YS Jagan ప్రకటనపైనే అందరి ఆసక్తి..!
ABN , First Publish Date - 2021-11-22T17:50:37+05:30 IST
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా..
అమరావతి : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులను ప్రకటించిన విషయం విదితమే. దీనికి సంబంధించిన బిల్లులు కూడా చట్ట సభల్లో, కోర్టుల దాకా కూడా వెళ్లాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇందుకు సంబంధించిన చట్టాలను ఉపసంహకరించుకున్నట్లు ఇవాళ జగన్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్‌కు తెలిపారు. రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ నివేదించారు. అనంతరం దీనిపై తదుపరి విచారణను 2:15కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అయితే.. ఈ ప్రకటన రాగానే ఇక మూడు రాజధానులు లేవని.. ఇక ఏకైక రాజధాని అమరావతేనని రాజధాని రైతులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. 706 రోజులుగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు దీక్ష చేస్తున్నారు. ఇదంతా రైతుల విజయమేనని పలువురు మేథావులు, జేఏసీ నేతలు చెబుతున్నారు.
కాసేపట్లో మరో బిల్లు..
అయితే.. ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే మరో ఆసక్తికర విషయం తెలియవచ్చింది. కాసేపట్లో ఈ పాలనావికేంద్రీకరణకు సంబంధించి మరో బిల్లును ప్రవేశపెట్టే అసెంబ్లీ వేదికగా జగన్ సర్కార్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. కాసేపట్లో అసెంబ్లీలో ఉపసంహరణతో పాటు కొత్త బిల్లుకు సంబంధఇంచి జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే.. ఈ బిల్లులో ఏయే అంశాలు ఉంటాయి..? జగన్ ఏం ప్రకటిస్తారో..? అనే విషయాలపై రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ఒకరిద్దరు మంత్రులు మాట్లాడుతూ.. టెక్నికల్‌గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని.. జగన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు.