బ్రిటీష్‌ కౌన్సిల్‌ వారి 'స్టడీ యూకే వర్చువల్ ఫెయిర్‌'

ABN , First Publish Date - 2021-08-18T22:51:40+05:30 IST

విద్యావకాశాలు, సాంస్కృతిక సంబంధాల కోసం యూకే అంతర్జాతీయ సంస్థ బ్రిటీష్‌ కౌన్సిల్‌ ఈ ఏడాదికి గాను ‘స్టడీ యూకే వర్చువల్ ఫెయిర్‌’ను ఈ నెల 21న(శనివారం) నిర్వహించబోతుంది.

బ్రిటీష్‌ కౌన్సిల్‌ వారి 'స్టడీ యూకే వర్చువల్ ఫెయిర్‌'

· యూకేలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్ధుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన సెమీ వార్షిక విద్యాకార్యక్రమం

· ప్రత్యక్షంగా 35 యూకే యూనివర్శిటీలకు చెందిన ప్రతినిధులను కలుసుకునే అవకాశం – కోర్సులు, స్కాలర్‌షిప్‌లు, అర్హతలు, వీసాలు, యూకేలో విద్యార్థుల జీవితం ఇలా మరెన్నో తెలుసుకోవచ్చు.

· గ్రాడ్యుయేట్‌ మార్గాలపై దృష్టి – యూకే నూతన విధానంతో విజయవంతంగా తమ కోర్సులను పూర్తి చేసిన తర్వాత కూడా అంతర్జాతీయ విద్యార్థులు బ్రిటన్‌లో కనీసం రెండు సంవత్సరాల పాటు నివసించేందుకు తగిన అవకాశాలను కల్పిస్తుంది.

హైదరాబాద్: విద్యావకాశాలు, సాంస్కృతిక సంబంధాల కోసం యూకే అంతర్జాతీయ సంస్థ బ్రిటీష్‌ కౌన్సిల్‌ ఈ ఏడాదికి గాను ‘స్టడీ యూకే వర్చువల్ ఫెయిర్‌’ను ఈ నెల 21న(శనివారం) నిర్వహించబోతుంది. ఇది సెమీ వార్షిక కార్యక్రమం. యూకేలో విద్యనభ్యసించాలనుకునే ఔత్సాహిక విద్యార్థులకు అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ స్టడీ యూకే ఫెయిర్‌ను 2020లో డిజిటల్‌గా మార్చారు. బ్రిటీష్‌ కౌన్సిల్‌ అప్పటి నుంచి ఆగస్టు, డిసెంబర్‌ నెలల్లో రెండు వర్చువల్‌ ఫెయిర్‌లను నిర్వహించింది. ఈ రెండింటిలోనూ కలిపి 11 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి.


గత కొన్నేళ్లుగా భారతీయ విద్యార్థులకు విదేశీ ఉన్నత చదువుల కోసం ప్రాధాన్యతా కేంద్రంగా యూకే ఉంటోంది. అలాగే బ్రిటన్ యూనివర్శిటీలలో ప్రతియేటా చేరుతున్న భారతీయ విద్యార్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాది 56వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు స్టూడెంట్‌ వీసాలను పొందారు. యూకే జారీ చేసిన మొత్తం స్టూడెంట్‌ వీసాలలో ఇది దాదాపు నాల్గో వంతుకు సమానం. బ్రిటీష్‌ కౌన్సిల్‌ సౌత్‌ ఇండియా డైరెక్టర్‌ జనక పుష్పనాథన్‌ మాట్లాడుతూ ‘‘బ్రిటీష్‌ కౌన్సిల్‌ వద్ద మేము భారతీయ విద్యార్థుల కోసం అతి సన్నిహితంగా పనిచేయడం జరుగుతోంది. యూకే కోర్సులు, యూనివర్శిటీలు, స్కాలర్‌షిప్స్ మొదలైన అంశాల గురించి పూర్తి సమాచారంతో తగు నిర్ణయాలు తీసుకోవడంలో విద్యార్థులకు తోడ్పాటు అందిస్తున్నాం. మా స్టడీ యూకే వర్చువల్‌ ఫెయిర్‌లు అత్యాధునిక, విశ్వసనీయ సమాచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా  కౌన్సిలర్లు, ఏజెంట్లకు అందిస్తాయి. ప్రతి యేటా మా ఫెయిర్‌లు వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తుంటాయి. ఈ సంవత్సరం కూడా యూకేలోని అత్యున్నత విద్యాసంస్థలలో విద్యానభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల నుంచి మాకు అనూహ్య స్పందన వస్తోంది. వారితో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఆగస్టు 21న నిర్వహించబోయే వర్చువల్‌ ఫెయిర్‌లో 35 యూకే యూనివర్శిటీల ప్రతినిధులు పాల్గొననున్నారు’’ అని అన్నారు.


స్టడీ యూకే వర్చువల్‌ ఫెయిర్‌లో పాల్గొనే విద్యార్థులు స్టూడెంట్‌ వీసా పొందడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ప్రక్రియలు, గ్రాడ్యుయేట్‌ మార్గాలకు సబంధించిన సమాచారాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అలాగే యూకే వీసాలు, ఇమ్మిగ్రేషన్‌(యూకేవీఐ) ఆఫీసర్స్‌, నిపుణుల నుంచి పూర్తి సమాచారం అందుతుంది. దీంతోపాటు కొత్తగా తీసుకొచ్చిన గ్రాడ్యుయేట్‌ ప్రొగ్రాం, యూకేలో స్టడీస్ పూర్తి చేసిన తరువాత లభించే ఉద్యోగావకాశాలకు సంబంధించిన సందేహాలను నివృతి చేసుకోవచ్చు. బ్రిటీష్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు సైతం అందుబాటులోని స్కాలర్‌షిప్‌లు, యూకేలో విద్యార్థి జీవితం గురించి తగు సమాచారం అందిస్తారు. అంతేగాక యూనివర్శిటీ ఎంపిక, అర్హత, దరఖాస్తు ప్రక్రియ, కోర్సు కంటెంట్‌ ఇలా మరెన్నో అంశాల గురించి 35 యూకే యూనివర్శిటీల ప్రతినిధుల మార్గనిర్ధేశకత్వము లభిస్తుంది. ఈ యూనివర్శిటీలలో ప్రతిష్టాత్మకమైన రస్సెల్‌ గ్రూపు వారిచే ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ అయిన యూనివర్శిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌, యూనివర్శిటీ ఆఫ్‌ బర్మింగ్‌ హామ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ గ్లాస్గో, యూనివర్శిటీ ఆఫ్‌ షెఫీల్డ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌‌తో పాటుగా ఇతర ప్రఖ్యాత ఇనిస్టిట్యూట్‌లు ఉన్నాయి. మరింత సమాచారం, రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు https://www.britishcouncil.in/study-uk/events/virtual-fair-2021 లింక్‌లో చూడవచ్చు. 


ఇక స్టడీ యూకే వర్చువల్‌ ఫెయిర్‌ కార్యక్రమం పూర్తి వివరాలు

తేదీ: శనివారం, 21 ఆగస్టు 2021,

వేదిక: జూమ్‌

సమయం: మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు


సెమినార్‌ షెడ్యూల్‌:

సెషన్‌ నేపథ్యం                                                       సమయం

స్టూడెంట్‌ వీసాలు, గ్రాడ్యుయేట్‌ రూట్‌                    మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3 గంటల వరకు

యూకేలో విద్య, నివాసం, స్కాలర్‌షిప్‌లు                మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 3.45 గంటల వరకు

Updated Date - 2021-08-18T22:51:40+05:30 IST