Abn logo
May 23 2020 @ 19:10PM

బీఎస్ఎన్ఎల్ ఈద్ స్పెషల్ రీచార్జ్ ప్లాన్.. 30జీబీ డేటా, ఫుల్ టాక్ టైం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రంజాన్‌, ఈద్‌ను పురస్కరించుకుని రూ.786తో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ప్రమోషనల్ ప్లాన్ అయిన ఇది 30 రోజులపాటు అందుబాటులో ఉంటుంది. 786 రూపాయల పూర్తి టాక్‌టైం, 30 జీబీ హైస్పీడ్ డేటా 90 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. నేటి నుంచే ఈ ప్లాన్ ఖాతాదారులకు అందుబాటులో ఉంది. వెబ్‌సైట్, యాప్, థర్డ్‌పార్టీ రీచార్జ్ సర్వీస్ ద్వారా ఈ ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.

Advertisement
Advertisement
Advertisement