Abn logo
Mar 2 2021 @ 19:49PM

విజయసాయిరెడ్డికి బుద్దా వెంకన్న కౌంటర్

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్  వేదికగా  కౌంటర్ ఇచ్చారు. ‘విశాఖలో నేను రెండెకరాల భూమి కబ్జా చేసానని ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆ రెండెకరాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తే రెండెకరాలని జగన్ రెడ్డి పేరు మీద లేదా వైసీపీ పేరు మీద రాయడానికి సిద్ధం. ఆధారాలు మీడియాకి చూపించండి రెండెకరాలు తీసుకోండి. మీ భూదాహానికి రెండెకరాలు చిన్న విషయమే అయినా ఆధారాలు చూపిస్తే చిరు కానుకగా ఇవ్వడానికి నేను సిద్ధం.’ అని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement