మనిషి కాదు.. కుక్క!

ABN , First Publish Date - 2022-01-26T09:04:48+05:30 IST

మంత్రి కొడాలి నాని మనిషి కాదని కుక్కని టీడీ పీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఆయన్ను కుక్క అని మాజీ ఎంపీ ఉండవల్లి

మనిషి కాదు.. కుక్క!

కొడాలి నానిని అరెస్టు చేయాలి

మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి

బుద్దా వెంకన్న డిమాండ్‌


విజయవాడ (వన్‌టౌన్‌) జనవరి 25: మంత్రి కొడాలి నాని మనిషి కాదని కుక్కని టీడీ పీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఆయన్ను కుక్క అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా అన్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా నాని భాష గురించే మాట్లాడుకుంటున్నారని చెప్పారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘కొడాలి నానికి డబ్బు పిచ్చి, మద పిచ్చి, పదవి పిచ్చి పట్టుకున్నాయి. పదవి కాపాడుకునేందుకు చంద్రబాబు, లోకేశ్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. కేసినో నిర్వహిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినా నిస్సిగ్గుగా బుకాయిస్తున్నాడు. గుట్కాలు, ఖైనీలు తినే నాని చివరికి కేన్సర్‌ వచ్చి పోవడం ఖాయం’ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు భిక్షతో నాని ఎమ్మెల్యే అయ్యాడని.. చంద్రబాబుకు కరోనా వస్తే హోమ్‌ ఐసొలేషన్‌లో ఇంటి వద్దే ఉన్నారని.. నానికి కరోనా వస్తే చచ్చిపోతానన్న భయంతో హైదరాబాద్‌ వెళ్లి ఆస్పత్రిలో చేరాడన్నారు. పోలీసులు తన విషయంలో ఎంత వేగంగా స్పందించారో నానిపై తమ ఫిర్యాదుపైనా అంతే వేగంగా స్పందించాలన్నారు. గుడివాడ వెళ్లకుండా టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారని.. గుడివాడ ఏమైనా పాకిస్థానా.. ఎవరూ వెళ్లకూడదా అని ప్రశ్నించారు.

‘నాని ఒక 420. అతడిపై బ్యాంకు కేసులున్నాయి. వెంటనే అరెస్టు చేయాలి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి. చంద్రబాబును వాడు, వీడని అంటే మేమూ నానిని వాడూ వీడూ అనే అంటాం’ అని స్పష్టం చేశారు. కాగా.. టీడీపీ నాయకులను దుర్భాషలాడిన మంత్రి నానిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ 53వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) మంగళవారం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-01-26T09:04:48+05:30 IST