వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు: ఆర్థిక మంత్రి

ABN , First Publish Date - 2022-02-01T17:25:12+05:30 IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు: ఆర్థిక మంత్రి

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా రైల్వే వ్యవస్థను తీర్చిదిద్దుతామన్నారు. అత్యంత సామర్థ్యం, మెరుగైన సౌకర్యాలు కలిగిన 400 వందే భారత్ రైళ్లను వచ్చే మూడేళ్లలో తీసుకురానున్నట్టు తెలిపారు. అలాగే పీఎం గతిశక్తి పథకంలో భాగంగా 100 గతిశక్తి టెర్మినల్స్, 25 వేల కి.మి. జాతీయ రహదారుల విస్తరణ చేయనునున్నట్టు ప్రకటించారు. 


పీఎం గతిశక్తి

విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలో బహుముఖ శాఖల అనుసంధానంతో పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. రూ.100 లక్షల కోట్లతో, 25 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ గతంలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో దేశ మౌలిక వసతుల రంగాన్ని సమూలంగా మార్పు చేసి, దాదాపు 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో, దేశంలో అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ప్రధాని తెలిపారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కూడా తమ ముఖ్య ఉద్దేశమని ప్రకటించారు.

Updated Date - 2022-02-01T17:25:12+05:30 IST