INSTAGRAMలో బల్క్‌ డిలీట్‌!

ABN , First Publish Date - 2020-05-16T05:30:00+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు ఇకమీదట తమ పోస్ట్‌లకు వచ్చే కామెంట్లను బల్క్‌గా డిలీట్‌ చేసుకోవచ్చు. నచ్చని యూజర్స్‌ను బల్క్‌గా బ్లాక్‌ చేసుకోవచ్చు. ఫొటో అండ్‌ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా ఈ ఫీచర్‌ను...

INSTAGRAMలో  బల్క్‌ డిలీట్‌!

ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు ఇకమీదట తమ పోస్ట్‌లకు వచ్చే కామెంట్లను బల్క్‌గా డిలీట్‌ చేసుకోవచ్చు. నచ్చని యూజర్స్‌ను బల్క్‌గా బ్లాక్‌ చేసుకోవచ్చు. ఫొటో అండ్‌ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సమయం వృథా కాకుండా ఉండడం కోసం మల్టిపుల్‌ కామెంట్స్‌ను ఒకేసారి డిలీట్‌ చేసుకునే సదుపాయాన్ని అందించింది. ఇందుకోసం ముందుగా కామెంట్‌పై ట్యాప్‌ చేయాలి. తరువాత కుడివైపున పైభాగంలో కనిపించే త్రీడాట్‌ ఐకాన్‌ను ఎంచుకోవాలి. అందులో ‘మేనేజ్‌ కామెంట్స్‌’ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. ఇప్పుడు డిలీట్‌ చేయాలనుకుంటున్న కామెంట్లను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ యూజర్స్‌ను బ్లాక్‌ చేయాలనుకుంటే ‘మోర్‌ ఆప్షన్స్‌’ను ఎంచుకోవాలి.


Updated Date - 2020-05-16T05:30:00+05:30 IST