క్రికెట్‌లో సామాజిక దూరంపై బుమ్రా కామెంట్స్

ABN , First Publish Date - 2020-06-01T23:40:41+05:30 IST

క్రికెట్‌లో సామాజిక దూరం పాటించడంపై భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా స్పందించాడు.

క్రికెట్‌లో సామాజిక దూరంపై బుమ్రా కామెంట్స్

ముంబై: క్రికెట్‌లో సామాజిక దూరం పాటించడంపై భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా స్పందించాడు. ‘నేను ఎక్కువగా ఎవరినీ హగ్ చేసుకోను, హైఫై ఇవ్వడం కూడా తక్కువే. కాబట్టి సామాజిక దూరం పాటించాలనే నిబంధనలు నాకు పెద్ద కష్టంగా కనిపించడంలేదు’ అని బుమ్రా చెప్పాడు. కరోనా భయంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తనలాంటి వాళ్లు పెద్దగా ఇబ్బంది పడబోరని తెలిపాడు. అయితే బంతికి ఉమ్మి రాయొద్దన్న నిబంధన మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుందని, దానికి వేరే పరిష్కార మార్గం ఆలోచిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2020-06-01T23:40:41+05:30 IST