‘‘30 వ తేదీ’ లోగా పూర్తి చేయండి... ఎస్‌బీఐ

ABN , First Publish Date - 2021-06-01T22:04:26+05:30 IST

దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. ఇటీవల డోర్‌స్టేప్ సేవల గురించి పూర్తి వివరాలను ట్విట్టర్ ఖాతా ద్వారా తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే.

‘‘30 వ తేదీ’ లోగా పూర్తి చేయండి... ఎస్‌బీఐ

ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. ఇటీవల డోర్‌స్టేప్ సేవల గురించి పూర్తి వివరాలను ట్విట్టర్ ఖాతా ద్వారా తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. కాగా... తాజాగా మరోసారి తమ కస్టమర్లకు ముఖ్యమైన ‘సందేశం’ పంపింది. తన ఖాతాదారులను సోషల్ మీడియా ద్వారా అలర్ట్ చేసింది.


ఖాతాదారులు తమ పాన్ కార్డును ఆధార్ నెంబర్ తో అనుసంధానించుకోవాలని కోరింది. పాన్ కార్డ్ నంబరును ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకోవడానికి ఈ(జూన్) నెల 30 వరకు గడువునిచ్చింది. ఈలోపు ఖాతాదారులు... రెండింటినీ లింక్ చేసుకోవాలి. గడువు సమయంలోపు పాన్ ఆధార్ లింక్ చేసుకోనిపక్షంలో... పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అంటే... డీ యాక్టివేట్ అవుతుంది.


అంతేకాదు... జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలన మేరకు... రూ. వెయ్యి వరకు జరిమాన పడుతుంది. ఈ క్రమంలోనే...   ట్విట్టర్ వేదికగా... ఎస్‌బీఐ... వారి పాన్ కార్డు- ఆధార్ అనుసంధానం విషయమై అప్రమత్తం చేసింది. 

Updated Date - 2021-06-01T22:04:26+05:30 IST