మళ్లీ ఎప్పుడు వస్తామో తేలీదు.. ఉద్యోగుల్ని తొలిగించాలి: టిక్‌టాక్

ABN , First Publish Date - 2021-01-27T22:01:54+05:30 IST

భారత్‌లో టిక్‌టాక్ నిషేధానికి గురైన నేపథ్యంలో ఉద్యోగుల్ని తొలగించాల్సి వస్తుందంటూ టిక్‌టాక్ మాతృసంస్థ భారత్‌లోకి కంపెనీ ఉద్యోగులకు తెలిపింది.

మళ్లీ ఎప్పుడు వస్తామో తేలీదు.. ఉద్యోగుల్ని తొలిగించాలి: టిక్‌టాక్

న్యూఢిల్లీ: భారత్‌లో టిక్‌టాక్ నిషేధానికి గురైన నేపథ్యంలో ఉద్యోగుల్ని తొలగించాల్సి వస్తుందంటూ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌ భారత్‌లోని ఉద్యోగులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అంతర్గతం మెమో ద్వారా ఈ విషయాన్ని చెప్పినట్టు సమచారాం. భారత్‌లో తిరిగి ఎప్పుడు అడుగుపెడతామో చెప్పలేమని కూడా వ్యాఖ్యానించిందట. ప్రస్తుతం భారత్‌లో టిక్‌టాక్ ఉద్యోగులు 2వేల మంది వరకూ ఉంటారని సమాచారం. టిక్‌టాక్ నిషేధం నేపథ్యంలో వీరి ఉద్యోగాలపై కత్తి వేలాడుతోంది. అయితే.. ఉద్యోగాల్లో కొత పడొచ్చంటూ కంపెనీ ఇప్పటికే పలు సూచనలు పంపించిందని సమాచారం. తాజాగా మెమో కూడా ఈ కోవలోకే వస్తుందని తెలుస్తోంది. ‘ఈ పరిస్థితి తాత్కాలికమని తొలుత భావించాం. కానీ..వాస్తవం ఇదికాదని తేలిపోయింది. యాప్‌లపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఉద్యాగాల్ని కొనసాగించలేం. మళ్లీ భారత్‌లో తిరిగి ఎప్పుడు అడుగుపెడతామో చెప్పలేకున్నాం’ అని టిక్‌టాక్ యాజమాన్యం తన మెమోలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-01-27T22:01:54+05:30 IST