Abn logo
Oct 19 2021 @ 18:02PM

సీ ఓటర్ సర్వే... అత్యంత ప్రజాగ్రహం ఉన్న శాసనసభ్యులుగా ఏపీ ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ: ఐఏఎన్ఎస్-సీ ఓటర్ చేసిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యంత ప్రజాగ్రహం ఉన్న శాసనసభ్యులుగా ఏపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తన సర్వేలో వెల్లడైంది. ప్రజాగ్రహం విషయంలో ఏపీ ఎమ్మెల్యేలు అగ్రస్థానంలో నిలిచారు. ప్రజాగ్రహంలో 28.5 శాతంతో దేశంలోనే ఏపీ టాప్‌లో ఉంది. ప్రజాగ్రహంలో రెండో స్థానంలో గోవా, మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. అతితక్కువ ప్రజాగ్రహం ఉన్న ఎమ్మెల్యేలలో 6.8 శాతంతో కేరళ నిలిచినట్లు సర్వేలో వెల్లడైందని ఐఏఎన్ఎస్-సీఓటర్ సర్వే తేల్చింది. 

ఇవి కూడా చదవండిImage Caption