Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాలిఫోర్నియాలో ఘోర రోడ్డుప్రమాదం.. 13 మంది దుర్మరణం!

కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ​ కాలిఫోర్నియాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎస్​యూవీ వాహనం, ట్రక్కు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎస్​యూవీని ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ప్రమాదస్థలిని పరిశీలించిన అధికారులు.. మంగళవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో(అమెరికా కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. కానీ, ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై మాత్రం స్పష్టత లేదని కాలిఫోర్నియా హైవే పెట్రోల్​ చీఫ్​ ఒమర్ వాట్సన్​ తెలిపారు.


ఇక మృతుల్లో ఎక్కువ మంది మెక్సికన్లు ఉండగా.. వీరంతా 15 నుంచి 53 ఏళ్లు లోపువారేనని అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రమాదానికి గురైన ఎస్​యూవీలో 25 మంది ప్రయాణికులు ఉండటం.. వారిలో ఎక్కువ మంది మెక్సికన్ వాసులు ఉండడంతో ఈ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తుంది. యూఎస్-మెక్సికో సరిహద్దుల్లో ప్రమాదం జరగడం వల్ల మానవ అక్రమ రవాణా జరుగుతుందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement