ఐఎంఇఐ నెంబర్‌తో పోన్‌ పట్టుకోవచ్చా?

ABN , First Publish Date - 2021-01-09T06:35:44+05:30 IST

కేవలం ఒక్క ఐఎంఇఐ నెంబర్‌ ఆధారంగా ఫోన్‌ ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవటం చాలా కష్టం. ఒక ఫోన్‌ ఏదైనా మొబైల్‌ టవర్‌కి కనెక్టయ్యే ప్రయత్నంలో భాగంగా దాని ఐఎంఇఐ

ఐఎంఇఐ నెంబర్‌తో పోన్‌ పట్టుకోవచ్చా?

ఐఎంఇఐ నెంబర్‌  జాగ్రత్తగా పెట్టి ఉంటే ఫోన్‌ పోయినా  సులభంగా వెతికి పట్టుకోవచ్చు అంటుంటారు.  ఇది నిజమేనా? 

-  కార్తీక్‌, వరంగల్‌

కేవలం ఒక్క ఐఎంఇఐ  నెంబర్‌ ఆధారంగా ఫోన్‌ ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవటం చాలా కష్టం.   ఒక ఫోన్‌ ఏదైనా మొబైల్‌ టవర్‌కి కనెక్టయ్యే ప్రయత్నంలో భాగంగా దాని ఐఎంఇఐ నెంబర్‌ని కూడా టెలికం కంపెనీకి  ప్రసారం చేస్తూ ఉంటుంది.  ఈ నేపథ్యంలో ఒక మొబైల్‌ ఫోన్‌ ప్రస్తుతం ఏ టవర్‌ లొకేషన్‌లో ఉందన్న   సమాచారం సెల్‌ఫోన్‌ కంపెనీల వద్ద ఉంటుంది.  అయితే గూగుల్‌ మ్యాప్స్‌లో  నిక్కచ్చిగా ఒక వ్యక్తి   సమాచారం కనిపించినట్లు సెల్‌ టవర్‌ డేటా అనేది అలా పిన్‌ పాయింటెడ్‌గా ఉండదు.  కనీసం రెండు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఆ మనిషి ఎక్కడైనా ఉండొచ్చు.


అదీ కూడా  ఏదైనా పోలీస్‌ కేస్‌ అయినప్పుడు మాత్రమే పోలీసు శాఖ నుంచి వచ్చిన రిక్వె్‌స్టని  ఆధారంగా చేసుకొని టెలికం కంపెనీలు ఈ సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి. చాలా మంది ఫోన్‌ పోగొట్టుకొని  పోలీస్‌ కేసు పెడితే అది దొరుకుతుందన్న భ్రమలో ఉంటుంటారు.  ప్రతి ఊళ్లోనూ రోజుకి కొన్ని వందల ఫోన్లు చోరీకి గురవుతుంటాయి.  ఈ నేపథ్యంలో పోలీసు శాఖపై ఇతర కేసుల విషయంలో ఉన్న ఒత్తిడి కొద్దీ  పోయిన ఫోన్‌లు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ.  కాబట్టి మీ ఫోన్‌ లో ఏదైనా ఏంటీ-థెటప్ట్‌  అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌  చేసుకోవడం తప్పించి  కేవలం ఐఎంఇఐ  నెంబర్‌పై  ఆధారపడకండి.


Updated Date - 2021-01-09T06:35:44+05:30 IST